కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఆయన పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గానికి తిరిగి వచ్చారు. అయితే, ఈ నెల పద్నాలుగు లేదా పదహారో తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై రాష్ట్ర , జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. ఈ మేరకు స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. నియోజకవర్గంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు పదివేల కోట్ల రూపాయల పలు రకాల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, జూనియర్ కాలేజీలు , 220పడకల ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రి, కొడంగల్ -నారాయణ పేట ఎత్తిపోతల పథకం , కొడంగల్ లో ఆరు కోట్లతో ఆర్అండ్ బీ అతిథి గృహాం, మూడోందల ముప్పై నాలుగు కోట్లతో రోడ్ల విస్తరణ పనులు, ముప్పై కోట్లతో పాఠశాలల్లో అదనపు తరగతి భవానలు తదితర అంశాలపై ఆయన సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.



