అంబరాన్నంటిన బోనాలు సంబరాలు

పల్లవి, వెబ్ డెస్క్ : గండిపేటలో పల్లవి అంతర్జాతీయ పాఠశాలలో బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి హేమ మదబుషి జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
అమ్మవారికి బోనాలు ఏ సందర్భంలో ఎందుకు సమర్పిస్తారో విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ గ్రామ దేవతల వేషధారణతో చూపరులను అలరించారు విద్యార్ధులు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు.
ప్రజలలో కలిగే చీడపీడలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సంగీత, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందం పాలుపంచుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అవగాహన చేసుకుని భావితరాలకు సంప్రదాయా లను భావితరాలకు వారసత్వంగా అందించాలని విద్యార్థులకు సూచించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.