పల్లవి మోడల్ స్కూల్ లో బోనాల సంబరాలు

పల్లవి, వెబ్ డెస్క్ : అల్వాల్ పల్లవి పాఠశాలలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బోనాలు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గారైన శ్రీమతి విద్యాధరిగారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ ప్రిన్సిపల్ సులక్షణ గారు, షిరిన్ మాధురి గారు హెచ్ఎం రీనా సాజన్ గారు, మణిందర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు నృత్య ,సంగీత మరియు పోతురాజుల ప్రదర్శనతో పండుగ వాతావరణం అంబరాన్ని అంటేలా సంబరాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో సంగీతం, నృత్యం మరియు కనులకు ఇంపైన చిత్రాలు తయారు చేసిన ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రశంసిస్తూ మరియు పండుగ విశిష్టతను గురించి కార్యక్రమాన్ని ముగించారు. శ్రీమతి విద్యాధరిగారు తమ చక్కని ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ముగించారు.