వీర జవాన్ మురళి నాయక్ పై బయోపిక్ ..!

పల్లవి, వెబ్ డెస్క్ : భారత సైనిక దళానికి చెందిన జవాన్ ముదావత్ మురళి నాయక్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025 లో పాల్గొన్నాడు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి తెలుగువాడైన ముదావత్ మురళి నాయక్ వీర మరణం పొందాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ “వీర జవాన్ మురళి నాయక్ దేశానికి గర్వకారణం. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నాం.మాకు అవకాశం దొరికితే ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దేశం గర్వపడే సినిమా అవుతుంది’ అన్నారు.
ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది ఒక రియల్ హీరో కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. నా గత సినిమా సోలో బాయ్ రిలీజ్ అయినప్పుడు మురళి నాయక్ గారి ఫ్యామిలీ ని పిలిచి వారితో మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడుతున్న ప్పుడు మురళి నాయక్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. మురళి భారత సైన్యానికి సేవలందించాలనే లక్ష్యంతో ఆర్మీలో చేరారు అని ఆయన అన్నారు.