ప్రభాస్ – అనుష్క గురించి బిగ్ అప్ డేట్.

పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరో , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అంటే ముందుగా గుర్తుకోచ్చేది మిర్చి. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో వీరిద్దరి జోడీ కూడా అంతే సక్సెస్ ఫుల్ అయింది. ఆ తర్వాత వీళ్లు లేటేస్ట్ గా నటించిన బాహుబలి సిరీస్ అయితే ఇక చెప్పనక్కర్లేదు.
పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాను సత్తా చాటారు . అప్పటి నుంచి వీరి కాంబినేషన్ లో ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా తెగ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త మళ్లీ వైరల్ అవుతుంది. అదే ప్రభాస్ హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
బాహుబలి కి మించి కథ వస్తే కల్సి నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో అనుష్క చెప్పినట్లు సమాచారం. ఖచ్చితంగా డార్లింగ్ తో మళ్లీ కలిసి నటించే రోజు వస్తుందని ఈ సందర్భంగా స్వీటీ తన మనసులోని కోరికను వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్వీటీ క్రిష్ దర్శకత్వంలో ఘాటీ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈనెల ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.