పాక్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే -కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా

పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు పెను రాజకీయ సంచలనాన్ని సృష్టిస్తున్నాయి..ఓ పాడ్ కాస్ట్ లో శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ తాను పాకిస్థాన్ కు వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టు అన్పిస్తుంది, అంతేకాదు నేపాల్, బంగ్లాదేశ్ లకు వెళ్లినప్పుడు కూడా అదేవిధంగా ఫీలయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు..
అక్కడతో ఆగకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ పొరుగుదేశాలతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి, సాంస్కృతిక సారూప్యాలు ఉన్నాయని నొక్కి చెప్పారు.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.