కోరిక తీరిస్తేనే మందుల చీటీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఆరోగ్యం బాగోకపోతే ఆసుపత్రికి వెళ్లాలి. కష్టమోస్తే దేవుడి దగ్గరకెళ్లాలి అని అందరూ అంటుంటారు. వైద్యో నారాయణో హరి అని అంటారు. ఈ వ్యాఖ్యలను కించపరిచేలా అమెరికా వైద్యుడోకరు తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల అత్యంత నిర్దయంగా ప్రవర్తించాడు.
అనారోగ్యం బారిన పడిన రోగులకు అత్యంత శక్తివంతమైన ఔషధాలు ఇస్తూ వాటికి అలవాటు పడ్డాక వారిని లైంగికంగా వేధిస్తున్నారు రితేశ్ కల్రా.. యాబై ఒక్క ఏండ్ల రితేశ్ కల్రా అనే వైద్యుడుని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం గృహ నిర్భందంలో ఉన్న ఆయన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రితేశ్ కల్రా తన క్లినిక్ ను మాత్రల కర్మాగారంగా మార్చేశారని న్యూజెర్సీ జిల్లా అటార్నీ వ్యాఖ్యానించారు.