వినాయక చవితి రోజు ఇది తప్పనిసరిగా చేయాల్సిందే..?

పల్లవి, వెబ్ డెస్క్ : వినాయకచవితి పండుగ ప్రపంచ వ్యాప్తంగా హిందువులు చాలా ఘనంగా జరుపుకునే పండుగ. మూడు రోజులు, ఐదు రోజులు, తొమ్మిది రోజులు, పదకొండు రోజులు ఇలా వినాయకుడి విగ్రహాన్నిపెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. విగ్రహాం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి మాంసాహారాలు కానీ మందులాంటివి కానీ అసలు తీసుకోరు.
ఇలాంటి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి పెట్టాల్సిన ముఖ్యమైన నైవేద్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలియజేసిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అందులో చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ” మిగిలిన రోజుల్లో కొబ్బరికాయ కొడితే చాలు.
కానీ వినాయక చవితి పూజలో మాత్రం ఉండ్రాళ్లు, కుడుములతో పాటు తప్పకుండా దోసకాయను నైవేద్యంగా పెట్టాలి. దాన్ని కూడా ప్రసాదంగా తీసుకోవాలి” అని ఆయన చెప్పారు. గణేశుడి ఆకలి తీర్చేందుకు పార్వతీదేవి దోసకాయ ఇచ్చారని, అందుకే దీనిని పూజలో పెడితే గణేశుడు సంతోషిస్తారని భక్తుల నమ్మకం.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు