వినాయక చవితి ఏరోజు జరుపుకోవాలి..!

పల్లవి, వెబ్ డెస్క్ : వినాయక చవితి ఏరోజు నిర్వహించుకోవాలనే విషయం పై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల ఇరవై రెండు, ఇరవై మూడు తారీఖుల్లో వరుసగా రెండు రోజులు అమావాస్య రావడంతో వినాయక చవితి ఏరోజు అనేది ఆర్ధం కాక చాలా మంది పండితులను ఆశ్రయిస్తున్నారు.
దీంతో భాద్రపద శుక్ల చవితి ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉంది. అందుకే ఆరోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్ నగర్ లోని వేదపండితులు క్లారిటీచ్చారు. అయితే, వినాయక పూజ చేసుకోవడానికి ఆరోజు ఉదయం 11.05గంటల నుంచి మధ్యాహ్నాం 1.40గంటల వరకు మంచి ముహూర్తం అని వారు తెలిపారు. నిమజ్జనం మాత్రం సెప్టెంబర్ ఆరో తారీఖున చేయాలని వేదపండితులు సూచిస్తున్నారు.