వైజాగ్ బీచ్ లో ఇటలీ టూరిస్టులకు షాకింగ్..
బీచ్‌లు సురక్షితంగా, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఏపీ ఆర్థిక రాజధాని వైజాగ్ లో విదేశీ పర్యాటకులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇటలీ దేశానికి చెందిన ఏడుగురు టూరిస్టులు శనివారం విశాఖపట్నంలోని యారాడ బీచ్ కు వెళ్లారు. బీచ్ లో స్వియ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండగా సముద్రపు కెరటాల్లోపడి నలుగురు విదేశీ టూరిస్టులు కొట్టుకుపోయారు. ఒడ్డుకు చేరుకోవడానికి కష్టపడుతున్న వారిని చూసి..వారి సహచరులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టారు.
ఇది గమనించిన జివిఎంసి లైఫ్‌గార్డులు వెంకటేష్, కె లోవరాజు, శ్రీనివాస్ లు వెంటనే రంగంలోకి దిగి కొట్టుకుపోతున్న విదేశీయులను సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న మెరైన్ పోలీసులు..ఎలాంటి రిస్క్ లు తీసుకోవద్దని విదేశీ టూరిస్టులను హెచ్చరించారు. ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన నలుగురు టూరిస్టులను కాపాడిన కోస్ట్ గార్డులను ఉన్నత అధికారులు అభినందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విశాఖపట్నం బీచ్‌ను జివిఎంసి నిరంతరం పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుతుందని..నగరంలోని బీచ్‌లు సురక్షితంగా, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
Related News
-
దారుణం .. ప్రేమించడం లేదన్న కోపంతో ప్రేమోన్మాది దాడి
-
నాగచైతన్య- శోభిత పెళ్లి పనులు షురూ.. వెడ్డింగ్ ఎక్కడంటే?
-
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత
-
అరె ఓ సాంబా ఏందిదీ : గబ్బర్‌సింగ్ రీరిలీజ్.. థియేటర్లు డ్యామేజ్!
-
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి!
-
ఎంతకు తెగించార్రా.. గంజాయి మత్తులో పోలీసులపైనే దాడి



