ఎంతకు తెగించార్రా.. గంజాయి మత్తులో పోలీసులపైనే దాడి
గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోయారు. ఏం చేస్తున్నామన్న సోయి లేకుండా ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. గంజాయి మత్తులో యువకులు పోలీసులను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. కన్ను పక్కన వాచిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికలు కూడా చూస్తుండి పోయారు కానీ ఏమీ చేయలేకపోయారు. మురోవైపు వైజాగ్ లో గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తుంది. చాలా మంది యువత గంజాయికి పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసు తనిఖీల్లో వెల్లడైంది.



