ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో పల్లా ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులుగా పల్లా విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల్లో భరోసా నింపారు
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో పల్లా ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులుగా పల్లా విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల్లో భరోసా నింపారు. ఈ క్రమంలో ఆయనకు వైరల్ ఫీవర్ ఎటాక్ అయింది. ఇంట్లోనే రేస్ట్ తీసుకున్న పల్లాకు ఫీవర్ ఎక్కువ కావడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
కాగా భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అటు వరదలు, ఇటు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు బయటకు వస్తున్నారు. నిన్న వర్షం కురవకపోవడంతో సహాయక చర్యలూ వేగంగా సాగాయి. వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోవైపు ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ గేట్ల స్థానంలో కొత్తవాటిని బిగించింది. ఇందుకోసం కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది.



