పెన్షన్లపై మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలోని అర్హులైన చాలా మంది పెన్షన్లను కట్ చేసినట్లు ప్రతిపక్ష పార్టీలు , సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పెన్షన్లను తొలగిస్తుందని వైసీపీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.
ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత పదిహేను నెలల్లో ఒక్క పెన్షన్ ను కట్ చేయలేదని తెలిపారు. ఏడాదిన్నరగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ను అందిస్తున్నామని అన్నారు.
గతంలో కొందరూ నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకే ఎనబై వేల మమ్దికి నోటీసులు మాత్రమే ఇచ్చాము. వాళ్లకు పెన్షన్ కట్ చేయలేదు. వాళ్లు తగిన సర్టిఫికెట్లను అందిస్తే పెన్షన్ అందిస్తాము. ప్రతిపక్షాలు చేస్తున్న, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు అని హితవు పలికారు.