చంద్రబాబును మించిన నేత లేరు – సీఎం రేవంత్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా టుడే నిర్వహించిన పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇంతవరకూ ఇండీ కూటమికి మద్ధతు ఇవ్వాలంటూ తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సంప్రదించినట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని ” తెలిపారు.
మా పార్టీ సీనియర్ నేత , లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ అలాంటి రాజకీయాలను ఇష్టపడరు. తానెప్పుడూ ఆ ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్. గతంలోనూ ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆయన్ని మించినవారు లేరని రేవంత్ వ్యాఖ్యానించారు.