వైసీపీకి అందుకే ప్రతిపక్ష హోదా రాలేదు- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ పార్టీ పదకొండు, కూటమి పార్టీలు 164 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కావాలని ఇంట బయట వైసీపీ పోరాడుతూనే ఉంది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు.
తాజాగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోవడానికి గల కారణాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” హిందూ ధర్మాన్ని విమర్శించడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. హిందువులపై రాజకీయ క్రీడ నడపాలనుకోవడం దుర్మార్గం . ఆలయాలు , పాలక మండళ్లు, దేవదాయ శాఖపై విషం చిమ్ముతారా అని ఆయన వైసీపీని ప్రశ్నించారు.
అసత్యాలతో వైసీపీ చేస్తున్న వికృత క్రీడను దేవుడు సైతం క్షమించడు. దేవుళ్లనూ దోచుకున్నందుకే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దేవదాయ శాఖలో దాదాపు ఐదోందల ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాం అని” ఆయన తెలిపారు.