కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి!
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి టికెట్‌ను దిలీప్ ఆశించారు. ఆయనకే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నా.. రాజకీయ సమీకరణాల్లో భాగంగా పోటీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వేయనున్నారు. ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. రేపటితో (మంగళవారం-13) నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిపోనుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు భావిస్తుంది



