అరె ఓ సాంబా ఏందిదీ : గబ్బర్‌సింగ్ రీరిలీజ్.. థియేటర్లు డ్యామేజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజైన గబ్బర్ సింగ్ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజైన గబ్బర్ సింగ్ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ డిప్యూటి సీఎం అయిన తర్వాత మొదటిసారి వచ్చిన పుట్టిన రోజు కావడం, గబ్బర్ సింగ్ లాంటి సినిమా రీరిలీజ్ కావడంతో సంబరాలు మిన్నంటాయి. థియేటర్లో సాంగ్స్‌కు, ఫైట్ సీన్స్‌కు ఫ్యాన్స్ డాన్సులు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. అయితే, కాకినాడ, వైజాగ్‌లో అభిమానుల చేసిస సెలబ్రేషన్స్‌లో థియేటర్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో పోలీసులకు ఓ థియేటర్ యజామని ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా చేస్తే మేనేజ్మెంట్స్ తీవ్రంగా నష్టపోతాయని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అంతకుముందు పవన్ కల్యాణ్ సినిమాలు థియేటర్లో రీరిలీజ్ చేయాలంటే భయంగా ఉందంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా పవన్ బర్త్ డే సందర్భంగా కోసం ఫ్యాన్స్ కోసం సెప్టెంబర్ 1వ తేదీన గబ్బర్ సింగ్ 4కే రీరిలీజ్ చేశారు.



