ఓజీ గురించి బిగ్ అప్ డేట్

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “ఓజీ”. ఈ సినిమా కోసం ఇటు పవన్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ తో పాటు ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అరున్ దాస్, హిమ్రాన్ హస్మీ తదితరులు నటిస్తున్నారు.
సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఓజీ గురించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ నెల ఇరవై ఐదో తారీఖున రానున్న ఈ చిత్రం అదే రోజు తెల్లారుజామున ఒంటిగంట షోతో ప్రేక్షకులను ఆలరించనున్నది. దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.