పవన్ నీకు చేతకాకపోతే తప్పుకో.. కేఏ పాల్ డిమాండ్
వరద బాధితులకు సహాయం చేయకపోవడం చేతకాకపోతే డిప్యూటీ సీఎం పదవినుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్
వరద బాధితులకు సహాయం చేయకపోవడం చేతకాకపోతే డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కల్యాణ్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. విజయవాడలో వరద బాధితులకు గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా ఆయన ఆహార పోట్లలు అందించారు. తాము ఇలాంటి సహాయ కార్యక్రమాలను ఎన్నో చేశామని అన్నార పాల్. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తనతో కలిసి పని చేయాలని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఏపీకి రూ.10 వేల కోట్లు, తెలంగాణకు మరో రూ.10 వేల కోట్లను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణ నష్టం జరిగిన జరిగిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు పాల్. అక్రమ నిర్మాణాలను తొలగించేలా తెలంగాణలో ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో కూడా ఏర్పాటు చేయాలని కేఏ పాల్ కోరారు.



