మురళీ నాయక్ కుటుంబానికి అండగా పవన్ కళ్యాణ్..!
పల్లవి, వెబ్ డెస్క్: పాకిస్థాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన మురళీ నాయక్ అంతిమ యాత్రకు డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తదితరులు హజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మురళీ కుటుంబానికి వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ రైల్వే ఉద్యోగం వచ్చినా మురళీ నాయక్ వెళ్లలేదు.
దేశసేవ చేస్తానని ఆర్మీలో చేరారు. కానీ ఇరవై మూడేండ్ల వయసులో చనిపోవడం చాలా బాధాకరం. మురళీ నాయక్ వీరమరణానికి పాకిస్థానే కారణం ‘ అని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాబై లక్షల రూపాయల ఆర్థికసాయం, ఐదెకరాల భూమి, మూడు వందల గజాల్లో ఇళ్లు, కుటుంబంలో ఒకరికి సర్కారు నౌకరిస్తామని ప్రకటించింది..



