రేషన్ బియ్యం తరలింపులో నలుగురు ఐపీఎస్లు.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోనే 43 వేల 249మెట్రిక్ టన్నులబియ్యం సీజ్ చేశామని మంత్రి వెల్లడించారు. విజయవాడ ఎపీఐఐసీ కాలనీలోని రైతు బజార్ లో కౌంటర్ ను ప్రారంభించారు మంత్రి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు అందాల్సిన బియ్యాన్ని..పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
రైతులకు ఇవ్వాల్సిన రూ.600కోట్లు త్వరలో చెల్లిస్తామని వెల్లడించారు. ధరల స్థిరీకరణకు రీటైలర్స్తో సమీక్షించామని .. 284 ఔట్ లెట్లు లో ఇవాళ కందిపప్పు, బియ్యం అందిస్తున్నామని వివరించారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాళ్ళ కందిపప్పు అందుబాటులో ఉంచామని.. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకు అందించడంలో పొరపాటు రాకుండా దాడులు చేస్తున్నామని తెలిపారు.



