మానవత్వం చాటుకున్న మంత్రి నాదేండ్ల..!
Nadendla Manohar Tenali Assembly Election
పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదేండ్ల మనోహర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంత్రి నాదేండ్ల విజయవాడ నుండి కాకినాడ కు వెళ్తున్నారు.
ఈ సమయంలో ఏలూరు జిల్లా భీమడోలు మండలం నాగులపల్లి అడ్డ రోడ్డు సమయంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న మంత్రి నాదేండ్ల ఈ విషయాన్ని గమనించి తక్షణమే తన కాన్వాయ్ ను ఆపించేశారు. కారు దిగి వచ్చిన నాదేండ్ల ఈ ప్రమాదానికి గురైన క్షతగాత్రుల పరిస్థితిని చూసి చలించిపోయారు.
తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాక, బాధితులను త్వరగా ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా తన కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనాన్ని అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా పంపాలని సిబ్బందిని ఆదేశించారు.
అక్కడితో ఆగకుండా, ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసిన మంత్రి నాదెండ్ల మనహర్, గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.



