మామ, అల్లుడు అడ్డంగా దొరికిపోయారు – ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : చేపల పులుసు కోసం తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టిన పాపాత్ములు కేసీఆర్, హరీశ్ రావు అని పరిగి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం సీఎల్పీ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ” ప్రజాభవన్ లో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్.. హరీశ్ కుట్రలను, కుతంత్రాలను బట్టబయలు చేశారని ” ఆరోపించారు.
ఈ ఇద్దరు నేతలు తెలంగాణకు చేసిన జలద్రోహాన్ని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు కట్టేలా వివరించారని తెలిపారు. రాయలసీమను రతనాల సీమ చేయడానికి కేసీఆర్, హరీశ్ చేసిన కుట్రలను రేవంత్ రెడ్డి బయటపెట్టడంతో తెలంగాణ ప్రజలకు మామ.. అల్లుడు అడ్డంగా దొరికిపోయారని ఆయన అరోపణలు చేశారు.



