క్షమించు దేవుడా.. దండం పెట్టి కిరీటం చోరీ చేసిన దొంగ

దేవుడిని క్షమించమని కోరుతూ..ఆయన కిరీటాన్ని దొంగలించాడు ఓ యువకుడు. ఈ విచిత్ర దొంగతనం ముంబయిలోని ఓ గుడిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ముంబై -విఠలేశ్వరుడి ఆలయంలోకి అర్ధరాత్రి దొంగతనం కోసం వెళ్లిన ఓ దొంగ.. దేవుడి విగ్రహం ముందు నిల్చొని దండం పెట్టాడు.
అనంతరం దేవుడి వెండి కిరీటాన్ని తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ గుడిలో ఉన్న సీసీ కెమెరాల్లో చోరీ ఘటన రికార్డ్ అయింది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.