ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు – మంత్రి కోమటిరెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై దాడి చేసి,కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
మీడియా స్వేచ్ఛను బెదిరింపులతో,దాడులతో అడ్డుకోవాలని ప్రయత్నించడం హేయనీయం అన్నారు. ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవర్నీ ఉపేక్షించబోమనీ తీవ్రంగా హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారితో పాటు,ఉసిగొల్పిన వారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.