రైతు రుణమాఫీ వీరికి లేనట్లే?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2 లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం రుణమాఫీకి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. రుణమాఫీకి పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకోనున్నట్లు సర్కార్ తెలిపింది. దీంతో ఐటీ చెల్లింపుదారులకు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో రుణమాఫీ మార్గదర్శకాలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. కొంతమంది రైతులు తమ పిల్లల చదువులు, స్టడీ, హౌసింగ్ లోన్ల కోసం రైతులు ఆదాయం తక్కువున్నా ఐటీ కడుతున్నారు. ఐటీ పరిధిలోకి రాని వారికి మాత్రమే రుణమాఫీ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికమని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకే రుణమాఫీ వర్తింపు ఉంటుందని వెల్లడించింది. రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉంటే..మొదట ఆ మెత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలి.. ఆ తర్వాత 2 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది. రిన్వల్ చేసిన వారికి రుణమాఫీ వర్తించదని తెలిపింది. తెలంగాణలోని అన్ని వాణిజ్య, ప్రాంతీయ, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుందని సర్కార్ స్పష్టం చేసింది.



