ఈనెల 19న తెలంగాణ క్యాబినెట్ భేటీ..!
పల్లవి, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల పంతోమ్మిదో తారీఖున భేటీ కానున్నట్లు సమాచారం.
వచ్చే నెల జూన్ రెండో తారీఖున తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి.



