ప్రభుత్వ స్కూళ్లలో అన్నీ వసతులు కల్పిస్తా: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మంగళవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో ఆయన భేటీ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాను కూడా పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలోనే చదివానని.. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని మల్క కొమరయ్య అన్నారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Related News
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
బరువు తగ్గాలనుకునేవాళ్లకు శుభవార్త..!
-
గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య



