స్మితా సబర్వాల్ పై వేటు..!
తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ఇటీవల సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ వ్యవహారించిన తీరుపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే.
ఆ నోటీసులపై కూడా స్మితా కొంచెం ఘాటుగానే స్పందించారు. తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న ఆమెను ఆర్థిక సంఘం కార్యదర్శిగా బదిలీ చేశారు.
అయితే తాజా నిర్ణయంతో ప్రపంచ సుందరి పోటీల కార్యక్రమానికి ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లైంది. ఇప్పటికే స్మితా తీరుపై అంటిముట్టనట్లుగా ఉన్న ప్రభుత్వం తాజా నిర్ణయంతో వేటు వేసినట్లైంది.
Related News
-
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు
-
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల
-
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్
-
ఆర్ అండ్ బి శాఖ కు మంచి పేరు తీసుకురావాలి – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి



