గత ఎన్నికల్లో రూ.70కోట్లు ఖర్చు పెట్టా – కొండా మురళి
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాకున్న ఐదోందల ఎకరాల్లో పదహారు ఎకరాలు అమ్మి రూ. డెబ్బై కోట్లను ఖర్చు పెట్టి మరి ఎన్నికల్లో పోటి గెలిచాము. నాకు వాళ్ల దగ్గర పైసా కూడా వద్దు. నేను వచ్చినప్పటి నుంచి ఎవరినైనా ఇబ్బంది పెట్టానా?.
ఇంకా ఐదోందల ఎకరాలు ఉన్నాయి అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొండా మురళి దంపతులపై ఆధిష్టానానికి పిర్యాదు చేశారు.
మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవిని కల్సి వివరణ ఇచ్చారు. తాజాగా మురళి వ్యాఖ్యలు ఎటు వైపు దారి తీస్తాయో అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.



