మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం : MLA పాయల్ శంకర్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ’ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే బీజేపీపై నిందలు వేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం. అయినా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గుర్తు చేశారు. తాము అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన విధంగా ముస్లిం అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గుర్తు చేశారు. బీసీలను మరోసారి మోసం చేస్తామంటే కాంగ్రెస్ ను క్షమించే ప్రసక్తి లేదని అన్నారు. మరోసారి బీసీలను మోసం చేస్తామంటే వారు కాంగ్రెసు క్షమించే ప్రసక్తి ఉండదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లో బీసీలకు ఇరవై వేల కోట్లు కేటాయించడానికి ఏ షెడ్యూల్ అడ్డొస్తుందని, ఏ కోర్టు అడ్డం వచ్చిందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజంగా కాంగ్రెస్ కు బీసీలపై ప్రేముంటే వెనకబడిన వర్గ నేతను సీఎం ను చేయండి. క్యాబినెట్ లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని ఆయన స్పష్టం చేశారు.



