బీజేపీకి జేబు సంస్థలా ఎన్డీఎస్ఏ : మాజీ మంత్రి హరీశ్ రావు
పల్లవి, వెబ్ డెస్క్ : బీజేపీకి జేబు సంస్థలా ఎన్డీఎస్ఏ వ్యవహరిస్తోంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ కు చెందిన రెండు ఫిల్లర్లు కూలితే విడతల వారీగా నివేదికను బయటపెడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక నివేదిక, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకో నివేదిక, బీఆర్ఎస్ సభ విజయవంతం అవ్వగానే మరో నివేదికను బయటపెట్టిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి ఇన్ని నెలలు అవుతున్న ఎన్డీఎస్ఏ అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన కాళేశ్వరంపై దుష్ప్రచారం – వాస్తవాల పై మాజీ మంత్రి హరీశ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కాళేశ్వరం కమీషన్ విచారణకు వెళ్లడానికి హరీశ్ రావు భయపడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయనకు ఎవరూ చెప్పారు నేను భయపడుతున్నాను అని. నేను తప్పకుండా కమిషన్ ఎదుట విచారణకు హజరవుతాను. లిఖిత పూర్వకంగా సమాధానమిస్తాను అని పేర్కొన్నారు.



