నోటికి ఏదోస్తే అది మాట్లాడుతారా : మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆమె చేసిన కామెంట్స్ పై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారా అంటూ మండిపడింది.
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆమె చేసిన కామెంట్స్ పై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసును శుక్రవారం విచారించిన కోర్టు .. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారా అంటూ మంత్రిపై మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొంది.
కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్న కోర్టు.. ఆమె కామెంట్స్ ను అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది.
ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ చేయోద్దంటూ మంత్రి కొండా సురేఖను హెచ్చరించింది. పరువునష్టం కేసులో ఓ మంత్రిపై కోర్టు ఇంతలా సీరియస్ కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖలో ఎలాంటి మార్పు రాలేదు.



