పంట వేసిన వారికే రైతు భరోసా.. రూ.7,500 ఎప్పటినుంచంటే?
పంట ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రబీ నుంచి పంట బీమాకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన MSPకే పంట కొనుగోలు చేస్తున్నామన్నారు.
పంట ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రబీ నుంచి పంట బీమాకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన MSPకే పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీని ఆధారంగా రబీ సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
పంట వేసిన వారికే డబ్బులు చెల్లించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా 25 వేల కోట్లు రైతు బంధు ఇచ్చిందని ఫిర్యాదులు వచ్చాయని, భవిష్యత్తులో అలాంటి ఫిర్యాదులు లేకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు తయారు చేస్తుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే దఫాలో రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల అన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని, సీఎం సూచనలతో రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామన్నారు. కుటుంబ నిర్ధారణ జరిగి వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల ఖాతాలకు డిసెంబర్లోగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు.



