మరో వివాదంలో మంత్రి సురేఖ..!
పల్లవి, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు.. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా నటి సమంత గురించి చేసిన కామెంట్స్ అప్పట్లో పెనుసంచలనం సృష్టించాయి.
ప్రస్తుతం ఈ అంశం కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. అటు తర్వాత తన బంధువుతో నోటి దురుసుతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో తెగ వైరల్ అయింది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుతో తన మేనల్లుడికి ఉద్యోగ గురించి మాట్లాడిన ఆడియో వీడియో బయటకు వచ్చి తరచూ మంత్రి సురేఖ వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ మాట్లాడుతూ మంత్రులందరూ ఫైళ్ల క్లియరెన్స్ కు డబ్బులు తీసుకుంటారు. కానీ నేను తీసుకోనని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఓ స్కూల్ నిర్మాణం గురించి చెబుతూ మంత్రి సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.



