మంత్రి పొంగులేటికి చేదు అనుభవం..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో జగిత్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సీనియర్ కాంగ్రెస్ నేత , మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తారసపడ్డారు.
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఓ వినతి పత్రాన్ని అంద జేసి, ఈ పనిని తప్పనిసరిగా చేయాల్సిందిగా ఆయన్ని కోరారు. దీనికి సాను కూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి దగ్గరకు వచ్చారు.
దీంతో జీవన్ రెడ్డి ‘ మీ రాజ్యం నడుస్తుంది. మీరే ఏలండి.. మా పని అయిపోయిది’ అని అంటూ ఆయనకు దూరంగా వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



