మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శపదం.!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చినా కూటమి ప్రభుత్వం కడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శపదం చేశారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ ” ఏట్టి పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాము. అవసరమైతే న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని” ఆయన బాబు సర్కారును డిమాండ్ చేశారు.
మరోవైపు, శ్రీశైలం టన్నెల్ పనులను మూడేండ్లలో పూర్తి చేస్తాము. నేను మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినాక పదహారు వందల కోట్ల రూపాయల నిధులను ఉమ్మడి జిల్లాకు తీసుకోచ్చానని తెలిపారు.