ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని వినూత్న నిరసన
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు సొంత నియోజకవర్గమైన మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం కిష్టాపురం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయలేదు.
దీంతో తీవ్ర అసహానానికి గురైన లబ్ధిదారులు సంబంధితాధికారులను ఊరు గ్రామ పంచాయితీ కార్యాలయంలో లోపల బంధించి తాళాలు వేశారు. ఎన్నికలకు ముందు నిరుపేదలకు.. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది.
తీరా అధికారంలోకి వచ్చాక తమ పార్టీ నేతలకు.. కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంది. ఇక రాష్ట్రంలో ఎలా ఉంటుందో ఆర్ధమవుతుంది వారు ఆక్షేపించారు.



