బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాకిచ్చిన హైకోర్టు.!
పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కు చెందిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో నిరాశే ఎదురైంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలాపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆ కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పాడి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తనను గెలిపించకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. దీనిపై నోడల్ అధికారి స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు.



