వర్షం బీభత్సం : కారులో కొట్టుకుపోయిన తండ్రికూతురు.. పోన్లు స్విచ్చాఫ్

తెలంగాణలో రెండ్రోజుల నుంచి కుండపోత వర్షాలు పడుతున్నాయ్. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరో రెండు రోజలు ఇలాగే వర్షాలు పడుతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వరదల్లో పలువురు గల్లంతయ్యారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వరదనీరు ప్రవహిస్తుండగా..ఈ వరదప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే ఈ కారులో హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతుర్లు ఉన్నారు. పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కారు అదుపుతప్పి వరదనీటిలోకి కొట్టుకుపోయింది. తమ కారు వాగులోకి పోయిందని, మెడవరకు నీరు వచ్చిందంటూ కుటుంబసభ్యులు, బందువులకు పోన్ లు చేసి చెప్పారు మోతిలాల్, అశ్విని. ప్రస్తుతం వారి పోన్ లు స్విచ్చాఫ్ రావడం.. కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బందువులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు