కలెక్టర్ ఆఫీసుకు రాలే.. ఇంట్లో పడుకుందా : జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఫోన్ చేస్తే కలెక్టర్ లిఫ్ట్ చేయలేదని... ఆఫీస్ కు వెళ్తే అక్కడా లేదన్నారు
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఫోన్ చేస్తే కలెక్టర్ లిఫ్ట్ చేయలేదని… ఆఫీస్ కు వెళ్తే అక్కడా లేదన్నారు. దీంతో తనకు కోపం వచ్చి ఆమె పీఏకు ఫోన్ చేశానన్నారు. మీ కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఆఫీస్ లో లేదు. ఇంట్లో భర్త దగ్గర పడుకుందా? అని అడిగానంటూ హాట్ కామెంట్స్ చేశారు.
దీంతో తనకు ఐదు నిమిషాల్లో ఆమె నుంచి ఫోన్ వచ్చిందన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా తన మాటలో దమ్ము ఉంటుందని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కలెక్టర్ పేరును మాత్రం జగ్గారెడ్డి ప్రస్తావించలేదు. గతంలో పనిచేసిన కలెక్టరా లేక ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గురించి ఆయన మాట్లాడారా అన్నది స్పష్టంగా తెలియలేదు. జగ్గారెడ్డి తాను కలెక్టర్‌ను తిట్టానంటూ ఉర్దూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కలెక్టర్ పై జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు pic.twitter.com/HbJ2xxI2Dz
— Pallavi Media (@pallavimedia) October 26, 2024



