హైదరాబాద్ లో మంచినీటి సరఫరాపై సీఎం సమీక్ష
జంటనగరాలకు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డు అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
జంటనగరాలకు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డు అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపైన, వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.
మూసీ ప్రక్షాళనలో భాగంగా హైదరాబాద్ కు గోదావరి నీటి తరలింపు..వాటిల్లో జంటనగరాల కోసం వినియోగించాల్సిన నీటి అంశాలపై చర్చించారు. సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.



