మూసీ వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని పెడతా : సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం మూసీ వద్ద నెలకొల్పుతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2024 అక్టోబరు 29వ తేదీన మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. మూసీని మరొక సిటీగా అభివృద్ది చేస్తామని చెప్పుకొచ్చారు
ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం మూసీ వద్ద నెలకొల్పుతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2024 అక్టోబరు 29వ తేదీన మీడియాతో సీఎం చిట్ చాట్ చేశారు. మూసీని మరొక సిటీగా అభివృద్ది చేస్తామని చెప్పుకొచ్చారు. మల్లన్న సాగర్ నుంచి రూ.7 వేల కోట్లతో నీటిని ఉస్మాన్ సాగర్‌కి మళ్ళిస్తామన్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు మొదటి ఫేజ్ పనులు చేపడతామని తెలిపారు.
అక్కడి నుంచి హిమాయత్ సాగర్ , బాపూఘాట్ వద్ద నీటిని శుద్ధి చేసి STPల ద్వారా నీటీని మూసీలోకి వదులుతామని వెల్లడించారు సీఎం రేవంత్. నెల రోజుల్లో ఇందుకు సంబంధించిన డిజైన్లు అన్నీ పూర్తి అవుతాయన్నారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రిక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కేటీఆర్, హరీష్, ఈటెల రాజేందర్.. మూసీపై మీ విజన్ ఏమిటో నాకు కాకుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇవ్వాలన్నారు. ముందు మూసీ ప్రజలు అక్కడే ఉండేలా తాను కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నానని.. ఆ తర్వాత ప్రజలను ఒప్పిస్తానన్నారు. రూ. 141 కోట్లతో డీపీఆర్ తయారీకి ఇచ్చామన్న సీఎం.. 3 నెలల్లో నివేదిక వస్తుందన్నారు. త్వరలోనే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని తెలిపారు సీఎం రేవంత్.



