సొంత జిల్లాలో కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఆహ్వాన పత్రికలో లాస్ట్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మెదక్ జిల్లాలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో కేసీఆర్ పేరును ఎమ్మెల్సీలు, ఇతర ఎమ్మెల్యేల తర్వాత చేర్చారు. ఆహ్వాన పత్రికలో మంత్రుల కంటే ముందు స్థానంలో చీఫ్ గెస్టుగా డాక్టర్ కె. కేశవరావు పేరును సలహాదారు పోస్టులో ఉంచారు, విశిష్ట అతిధిలుగా మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ పేర్లను తరువాతి స్థానంలో పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ పేరును ఈ విధంగా చివర్లో ఉంచడంపై బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటు కేసీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వింత చేష్టలు, విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని… సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు తప్పక జవాబు చెబుతారని పార్టీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారమే ఆహ్వాన పత్రికలో పెట్టామని లోకల్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
సిగ్గు, సిగ్గు!
దిగజారుడుతనంలో పరాకాష్టకు చేరుకున్న కాంగ్రెస్.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి తమ కుంచిత స్వభావాన్ని మరొక్కసారి బయపెట్టుకున్న రేవంత్ సర్కార్.
ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ..… pic.twitter.com/uASLXKU3NJ
— BRS Party (@BRSparty) August 14, 2024



