కాంగ్రెస్ శ్రేణులపై సీఎం రేవంత్ ఆగ్రహం !
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గాంధీభవన్ లో ధర్నాలు, రాస్తోరోకులు చేయొద్దని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలి. యాదవులను పట్టించుకోవడం లేదని గాంధీభవన్ లో గొర్రెలను తీసుకోస్తుంటే మీరు ఏమి చేస్తున్నారని భవన్ ఇంచార్జులను హెచ్చరించినట్లు వార్తలు గుప్పమంటున్నాయి.
ఈ సమావేశంలోనే మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ యాదవులను పట్టించుకోవడం లేదు. వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీపై యాదవులల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు.



