వక్ఫ్ పై ప్రభుత్వ నిర్ణయం విప్లవాత్మకం..డీకే అరుణని కలిసిన మల్క కొమరయ్య
వక్ఫ్ సవరణల బిల్లుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని బీజేపీ నేత మల్క కొమరయ్య అన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని బీజేపీ నేత మల్క కొమరయ్య అన్నారు. వక్ఫ్ సవరణపై తన సూచనలను శుక్రవారం సాయంత్రం పేపర్ రూపంలో మహబూబ్ నగర్ ఎంపీ, పీఏసీ సభ్యురాలు డేకే అరుణను కలిసి అందజేశారు. తన సూచనలు పరిశీలించాలని కోరారు. వక్ఫ్ బోర్డు వల్ల చాలా మంది సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కొమరయ్య తెలిపారు.
ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024 ను ఇటీవల కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా సహా పలు విపక్ష పార్టీలు,ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు అంగీకరించిన కేంద్రం.. ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా, వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయం సేకరణ కోసం తెలంగాలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటన చేపట్టింది. రాష్ట్ర మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో శనివారం తాజ్ కృష్ణ హోటల్ లో జేపీసీ చైర్ పర్శన్ జగదాంబికా పాల్ నేతృత్వంలో కమిటీ సమావేశమైంది. జేపీసీ ముందు తెలంగాణ,ఏపీ,ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వినిపించారు. తెలంగాణలో తమ తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువస్తూ సవరణ బిల్లుకు ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించి జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్‌కు బీజేపీ ఎంపీలు వినతిపత్రాలు అందజేశారు.
ఏంటీ వక్ఫ్ చట్టం?
1954లో భారత ప్రభుత్వం మొదటిసారి వక్ఫ్ చట్టాన్ని తీసుకు వచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు.. ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్.. మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో మరోసారి సవరణలు చేసింది. వక్ఫ్ చట్టంలో నిబంధనల ప్రకారం.. వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా,ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి.
ప్రభుత్వం ఏం చేస్తోంది
ఈ వక్ఫ్ బోర్డు సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది. సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం తెలిపింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించటం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్ట్‌లు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని,ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు పార్లమెంట్,రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డులు ముందు లాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు.
Related News
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
స్థానిక ఎన్నికల్లో కాషాయపు జెండా ఎగురవేద్దాం- ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ (సరూర్ నగర్)లో గురు పౌర్ణమి వేడుకలు
-
పీవీ సింధు అలా చేయడం కరెక్ట్ కాదు..!
-
కష్టపడితే ఏదైనా సాధ్యమే : మల్క కొమరయ్య