యాంకర్ స్వేఛ్ఛ ఆత్మహత్య – లేఖ వైరల్

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ న్యూస్ యాంకర్, జర్నలిస్టు, రచయిత్రి స్వేఛ్చ వోటార్కర్ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తమ కూతుర్ని పూర్ణచందర్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడు. అందుకే మా కూతురు స్వేఛ్ఛ ఈ దారుణానికి పాల్పడింది అని ఆమె తండ్రి శంకర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పూర్ణచందర్ అనే వ్యక్తి పేరుతో ఓ లేఖ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లేఖలో ” మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్టు స్వేచ్చ బలవన్మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవలసిన కొన్ని నిజాలు.
నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం. స్వేఛ్చ నాకు 2009 నుంచి పరిచయం . మేము ఇద్దరము టీ న్యూస్ లో పనిచేసేవాళ్లము. టీన్యూస్ లో మాకు (మేము) స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునేవాళ్లము. వాళ్ల తల్లిదండ్రులు జనశక్తిలో పని చేస్తూ ఆరు నెలల వయసు ఉన్న స్వేఛ్చను వారి అన్నవదినలకు వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి, స్వేఛ్చను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నో సార్లు చెప్పుకుని ఆమె బాధపడిన సందర్భాలు నేను గుర్తు చేసుకుంటున్నాను ఈ సందర్భంగా.
స్వేఛ్చ తర్వాత వివిధ ప్రముఖ ఛానెళ్లలో జర్నలిస్టుగా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత నేను ఎంతో సంతోషించిన సందర్భాలున్నాయి. దురదృష్టవశాత్తు 2008-2009 మధ్య కాలంలో మొదటి వివాహాంలో విడాకులు మరియు 2016-2017 ప్రాంతంలో రెండవ వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్చ ఏరోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లో లేవు. రెండవ వివహాం ద్వారా తనకు కలిగిన పాప ఆరణ్యలో వెతుక్కున్నేది. తన బాధను రాతలరూపంలో తెలియజేసిన సందార్భాలు కోకొల్లలు” అని ఐదు పేజీల లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మీరు ఒక లుక్ వేయండి.