పాకిస్థాన్ కు ఎంఐఎం చీఫ్ ఓవైసీ వార్నింగ్..!

జమ్ము కశ్మీర్ లోని పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి గురించి హైదరాబాద్ ఎంపీ.. ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ” కాలగమనంలో పాకిస్థాన్ భారత్ ల మధ్య ఆర్ధగంట సమయం మాత్రమే తేడా ఉంది. కానీ అభివృద్ధిలో భారత్ కంటే వందేళ్లు వెనక బడి ఉంది.
మీ దేశ బడ్జెట్ భారత్ ఆర్మీ వార్షిక బడ్జెట్ అంతా ఉండదు. భారత్ తో పెట్టుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఓవైసీ మాట్లాడుతూ పాకిస్థాన్ భారత్ తో పోల్చుకోవద్దు.పహాల్ గామ్ లో ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్ పెంచి పోషించిన ఐఎస్ ఐ సంస్థ ట్రైన్ చేసిన ముష్కరులే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాక్ నాయకుడు బిలావర్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మీ తాతను మీ అమ్మను చంపింది ఉగ్రవాదులే. ఈ విషయం గుర్తుంటే మీరు ఇలా మాట్లాడరు. మాదగ్గర అణ్వాయుధాలున్నాయి. ఇతర దేశాలపై యుద్ధానికి దిగుతామంటే ఎవరూ కూర్చుని చూస్తూ ఉండరని హెచ్చారించారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని ఆయన పునరుద్ఘాటించారు.