నాచారం డీపీఎస్లో పోస్టల్ వర్కర్స్ డే
 
                                
పల్లవి, హైదరాబాద్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం క్యాంపస్ లో 3, 4వ తరగతి విద్యార్థులు జాతీయ తపాలా ఉద్యోగుల దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. దేశంలో పోస్టల్ ఉద్యోగుల పాత్ర గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శిరీష ఆధ్వర్యంలో విద్యార్థులు మెయిల్ ఆర్ట్ తో అలరించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి, దేశ సేవలో ఉద్యోగుల పాత్రను గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని గుర్తు చేశారు.



 
          



