టీమిండియాలోకి ఇద్దరు బౌలర్లు..!

పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో చివరివరకూ పోరాడి చరిత్రాత్మకంగా డ్రాగా ముగించి మంచి జోష్ లో ఉంది టీమిండియా. మరోవైపు చేజేతుల్లారా మ్యాచ్ ను కోల్పోయామనే నిరాశలో ఇంగ్లాండ్ జట్టు ఉంది. ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టుతో జరగబోయే చివరి టెస్టు మ్యాచ్ లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అర్దీప్ సింగ్ తో పాటు మరో బౌలరు ఆకాశ్ దీప్ కూడా జట్టులోకి రావోచ్చని తెలుస్తోంది. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కు విశ్రాంతి ఇస్తే ఆయన స్థానంలో అర్శ్ దీప్ సింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే ధ్రువ్ జురెల్ ను వికెట్ కీపర్ గా కొనసాగించవచ్చు అని టాక్. మరోవైపు శార్దుఊల్ ఠాకూర్ ను కొనసాగించాలా వద్దా అనేదానిపై టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.